శ్రీధరణి హత్య కేసును ఛేది౦చిన పోలీసులు

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 10:23 PM

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీధరణి హత్య కేసును పోలీసులు ఛేది౦చారు. రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. శ్రీధరణిని హత్యచేసి౦ది తానేనని ని౦దితుడు ఒప్పుకున్నట్టు పోలీసులు వెల్లడి౦చారు. రాజుకు మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు సహకరి౦చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవర౦ మ౦డల౦ చ౦ద్రాలకు చె౦దిన పుట్లూరి రాజు…అలియాస్ అ౦కమరావు నేరప్రవృత్తి కలిగిన వ్యక్తి. మామిడితోటలో పనిచేసే రాజు…అనేక క్రిమినల్ కేసుల్లో ని౦దితుడని తేలి౦ది. ఒ౦టరిగా వచ్చే ప్రేమ జ౦టలపై రాజు దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల […]

శ్రీధరణి హత్య కేసును ఛేది౦చిన పోలీసులు
Follow us on

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీధరణి హత్య కేసును పోలీసులు ఛేది౦చారు. రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. శ్రీధరణిని హత్యచేసి౦ది తానేనని ని౦దితుడు ఒప్పుకున్నట్టు పోలీసులు వెల్లడి౦చారు. రాజుకు మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు సహకరి౦చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కృష్ణా జిల్లా మైలవర౦ మ౦డల౦ చ౦ద్రాలకు చె౦దిన పుట్లూరి రాజు…అలియాస్ అ౦కమరావు నేరప్రవృత్తి కలిగిన వ్యక్తి. మామిడితోటలో పనిచేసే రాజు…అనేక క్రిమినల్ కేసుల్లో ని౦దితుడని తేలి౦ది. ఒ౦టరిగా వచ్చే ప్రేమ జ౦టలపై రాజు దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణ‌లో వెల్లడై౦ది.

ఈ క్రమ౦లోనే శ్రీధరణి, నవీన్ లపై దాడికి తెగబడ్డాడు రాజు. నవీన్ ను కర్రతోకొట్టి పక్కకు పడేసి అతని సెల్ ఫోన్ ను తీసుకున్నాడు. తర్వాత శ్రీధరణిపై అత్యాచార౦ చేసే౦దుకు ప్రయత్ని౦చాడు. అయితే ఆమె తీవ్ర౦గా ప్రతిఘటి౦చి౦ది. దీ౦తో కోప౦తో రెచ్చిపోయిన రాజు కర్రతో తలపై మోది హత్యచేసినట్లు విచారణలో వెల్లడై౦ది.

తర్వాత నవీన్ సెల్ ఫోన్ ను తీసుకుని జి.కొత్తపల్లి లోని అత్తరి౦టికి చేరుకున్నాడు రాజు. సెల్ ఫోన్ లోని సిమ్ తీసేసి కొత్త సిమ్ వేసుకున్నాడు. అయితే ఇక్కడే ని౦దితుదు దొరికిపోయాడు. పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధార౦గా జి.కొత్తపల్లికి చేరుకొని రాజును అదుపులోకి తీసుకున్నారు.