పలు రాష్ట్రాల్లో హై అలర్ట్

పలు రాష్ట్రాల్లో హై అలర్ట్

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్-2 నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ సరిహద్దును పంచుకుంటూ ఉన్న పలు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డర్‌లో ఉన్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిస్థితిని పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఆ రాష్ట్ర డీజీపీ అత్యవసరంగా సమావేశమయ్యారు. అటు పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే భారత్ చేసిన దాడి నేపథ్యంలో ప్రధాని మోడీ, రక్షణ […]

Vijay K

|

Feb 26, 2019 | 11:41 AM

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్-2 నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ సరిహద్దును పంచుకుంటూ ఉన్న పలు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డర్‌లో ఉన్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిస్థితిని పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.

ఆ రాష్ట్ర డీజీపీ అత్యవసరంగా సమావేశమయ్యారు. అటు పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే భారత్ చేసిన దాడి నేపథ్యంలో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసరంగా సమావేశమై చర్చలు జరుపుతున్నారు. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో పలు వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది.

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది.

జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన ఈ దాడిలో 200కి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం అందుతోంది. అయితే భారత రక్షణ శాఖ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు పాక్ మాత్రం లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటుకుని వచ్చిన భారత విమానాలను తిప్పికొట్టామని ప్రకటించుకుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu