AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్: వచ్చే ఐదు రోజులు తీవ్రంగా ఎండలు

వచ్చే ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది

బ్రేకింగ్ న్యూస్: వచ్చే ఐదు రోజులు తీవ్రంగా ఎండలు
Rajesh Sharma
| Edited By: |

Updated on: May 24, 2020 | 2:27 PM

Share

వచ్చే ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాలతోపాటు ఉ పలు ఉత్తరాది రాష్ట్రాలలో ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాజస్థాన్ లోని బికనేర్ లో వచ్చే ఐదు రోజుల పాటు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో సైతం 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని అంటున్నారు.

పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, చత్తీస్గడ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కోస్తాంధ్రలో హీట్ వెవ్ తీవ్రంగా ఉంటుందని ఐ ఎం డి హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో ఇంటి నుంచి ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని రామగుండం, ఆంధ్రప్రదేశ్లోని రెంటచింతల ప్రాంతాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వాతావరణ హెచ్చరిక ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

Follow Us
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?