టీఎస్ఆర్టీసీలో “సెల్ఫ్ డిస్మిస్” ప్రకంనలు .. సమ్మె కొనసాగేనా?
పండుగ సమయంలో టీఎస్ఆర్టీసీ సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ కుప్పకూలినట్టయింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి, ప్రభుత్వానికి మధ్య చర్చలు లేకపోవడంతో తమ భవిష్యత్తు ఏమిటనే ఆలోచనలో పడ్డారు ఆర్టీసీ కార్మికులు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసి నష్టాలనుంచి లాభాలవైపునకు పయనింపజేసేలా మూడు నిర్ణయాలను తెరపైకి తెచ్చారు సీఎం కేసీఆర్. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో సమ్మె చేస్తున్న కార్మికులు కూడా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సమ్మె, తమ భవిష్యత్తు కార్యచరణపై ఆలోచన […]
పండుగ సమయంలో టీఎస్ఆర్టీసీ సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ కుప్పకూలినట్టయింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి, ప్రభుత్వానికి మధ్య చర్చలు లేకపోవడంతో తమ భవిష్యత్తు ఏమిటనే ఆలోచనలో పడ్డారు ఆర్టీసీ కార్మికులు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసి నష్టాలనుంచి లాభాలవైపునకు పయనింపజేసేలా మూడు నిర్ణయాలను తెరపైకి తెచ్చారు సీఎం కేసీఆర్. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో సమ్మె చేస్తున్న కార్మికులు కూడా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే సమ్మె, తమ భవిష్యత్తు కార్యచరణపై ఆలోచన చేసేందుకు బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆర్టీసీ జేఏసీ నేతలు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈ సమావేశం జరగునుంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు పార్టీలు మద్దతునిచ్చాయి. బుధవారం జరిగే అఖిల పక్ష సమావేశానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ నేతృత్వంలో సమ్మెకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయ పార్టీల నేతలు హాజరై చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న సమ్మె చట్ట విరుద్దమని ప్రభుత్వం చెబుతోంది . విధులకు హాజరుకాకుండా స్వచ్ఛందంగా తొలగిపోయారని చెబుతూ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఎక్కడా వారిని తొలగించలేదని.. అదే సమయంలో వారికి వారే తొలగిపోయారని చెప్పారు. ఏ ఒక్క ఉద్యోగిని ప్రభుత్వం తొలగించకుండా .. ఆ పరిస్థితిని వారికి వారే తెచ్చుకున్నారని ప్రభుత్వం చెబుతోంది.
ఆర్టీసీ సమ్మెతో ఏర్పడ్డ పరిస్థితిపై సీఎం కేసీఆర్ రెండు సార్లు అధికారులతో భేటీ అయ్యారు. సునీల్ శర్మ రిపోర్టు ఆధారంగా ఆర్టీసీపై చర్చించారు. ఒకేసారి 48 వేలమంది సిబ్బందిని తొలగిస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సెల్ఫ్ డిస్మిస్ అనే పదాన్ని ఉపయోగించినట్టుగా తెలుస్తోంది.