ఆస్తెంతో చెప్పను.. అప్పు మాత్రం 100 కోట్లు !

| Edited By: Srinu

Oct 11, 2019 | 7:48 PM

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎప్పుడేం కామెంట్ చేసినా అది న్యూసే. తాజాగా ఇలాంటి కామెంట్ తోనే ఆయన మరోసారి వార్తలకెక్కారాయన. అయితే ఈసారి ఆయన రాజకీయ ప్రత్యర్థుల గురించో.. లేక తన సొంత పార్టీ కాంగ్రెస్ అంతర్గత విషయాల గురించో కాదు.. ఏకంగా తన సొంత విషయాలను వెల్లడిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేసి.. న్యూస్ మేకర్ అయ్యారు జగ్గారెడ్డి. శుక్రవారం నాడు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ వర్కర్ల […]

ఆస్తెంతో చెప్పను.. అప్పు మాత్రం 100 కోట్లు !
Follow us on

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎప్పుడేం కామెంట్ చేసినా అది న్యూసే. తాజాగా ఇలాంటి కామెంట్ తోనే ఆయన మరోసారి వార్తలకెక్కారాయన. అయితే ఈసారి ఆయన రాజకీయ ప్రత్యర్థుల గురించో.. లేక తన సొంత పార్టీ కాంగ్రెస్ అంతర్గత విషయాల గురించో కాదు.. ఏకంగా తన సొంత విషయాలను వెల్లడిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేసి.. న్యూస్ మేకర్ అయ్యారు జగ్గారెడ్డి.

శుక్రవారం నాడు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ వర్కర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు జగ్గారెడ్డి. ఈ సందర్భంగా వర్కర్లనుద్దేశించి మాట్లాడిన జగ్గారెడ్డి.. టిఆర్ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడనని ప్రకటించారు. తన అనుచరులు కూడా ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా మట్లాడవద్దని చెప్పారు. తానేం చేసినా, ఏం మాట్లాడినా అంతా వ్యూహాత్మకమేనని చెప్పుకున్నారు జగ్గారెడ్డి. అయితే తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ చాలా ఆసక్తికరమైన కామెంట్లు చేశారాయన.

రాజకీయాల్లోకి వచ్చాక తాను అప్పుల్లో కూరుకుపోయానని, ఒక్కపైసా సంపాదించలేకపోయానని అన్నారు జగ్గారెడ్డి. తన భార్యకు కనీసం 20 తులాల బంగారం కూడా కొనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చెబుతూ తన అప్పుల చిట్టా విప్పారు సంగారెడ్డి ఎమ్మెల్యే. తనకు ఏకంగా వంద కోట్ల రూపాయల అప్పులున్నాయని జగ్గారెడ్డి వెల్లడించారు. అయితే తన ఆస్తి ఎంతో మాత్రం చెప్పలేదాయన. తను వంద కోట్ల అప్పుందని చెబితే ఎవ్వరూ నమ్మరంటూనే అది ముమ్మటికి నిజమని చెప్పుకున్నారు.

అప్పులు చేశాను కానీ ఎవ్వరికీ అమ్ముడు పోలేదని చెప్పారు జగ్గారెడ్డి. ప్రస్తుతం కెసీఆర్ దగ్గర తల వంచడానికి కారణం తన నియోజకవర్గమేనని అన్నారు. ప్రతి కూల పరిస్థితుల్లో తనను గెలిపించిన నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం.. తన నియోజక వర్గ అభివృద్ది కోసం తాను కెసీఆర్ ను విమర్శించవద్దని నిర్ణయించుకున్నానని అన్నారు జగ్గారెడ్డి. మొత్తానికి జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి.