శివస్వాములకు రోడ్డు ప్రమాదం

మహబూబ్‍నగర్ జిల్లాకు చె౦దిన శివస్వాములకు ఘోర ప్రమాదం జరిగింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు బైకులపై వెళ్తుండగా కర్నూలు జిల్లా మన్ననూరు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు. నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఐదుగురు శివస్వాములు బైకులపై శ్రీశైలం వెళ్తుండగా అటవీ ప్రాంతంలో జింక బైకుకు తగలడంతో కిందపడ్డారు. సురేష్ అనే స్వామి ఘటనా స్థలంలోనే చనిపోగా…నరేష్ అనే మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

శివస్వాములకు రోడ్డు ప్రమాదం

Edited By:

Updated on: Oct 18, 2020 | 10:24 PM

మహబూబ్‍నగర్ జిల్లాకు చె౦దిన శివస్వాములకు ఘోర ప్రమాదం జరిగింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు బైకులపై వెళ్తుండగా కర్నూలు జిల్లా మన్ననూరు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు.

నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఐదుగురు శివస్వాములు బైకులపై శ్రీశైలం వెళ్తుండగా అటవీ ప్రాంతంలో జింక బైకుకు తగలడంతో కిందపడ్డారు. సురేష్ అనే స్వామి ఘటనా స్థలంలోనే చనిపోగా…నరేష్ అనే మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.