మన హీరోయిన్లు.. మహా లక్ష్మిల్లా ఎంత ముద్దుగున్నారో! 

పెయింటర్ ‘రవి వర్మ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వేసిన పెయింటింగ్‌లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవే. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన కుంచె నుంచి జాలువారాయి. మరి రవివర్మే దిగి వచ్చి.. మన అందాల ముద్దుగుమ్మల ఫొటోలు గీస్తే ఎలా ఉంటుంది?.. ఇదిగో ఇలానే ఉంటుంది. అయితే.. ఇవి ఆయన గీసిన పెయింటింగ్స్ కాదు. సుహాసినీ మణిరత్నం స్థాపించిన ‘నామ్’ అనే సంస్థ వారి క్యాలెండర్ ఫొటోషూట్ కోసం ప్రఖ్యాత పెయింటర్ రవి వర్మ […]

మన హీరోయిన్లు.. మహా లక్ష్మిల్లా ఎంత ముద్దుగున్నారో! 

పెయింటర్ ‘రవి వర్మ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వేసిన పెయింటింగ్‌లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవే. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన కుంచె నుంచి జాలువారాయి. మరి రవివర్మే దిగి వచ్చి.. మన అందాల ముద్దుగుమ్మల ఫొటోలు గీస్తే ఎలా ఉంటుంది?.. ఇదిగో ఇలానే ఉంటుంది. అయితే.. ఇవి ఆయన గీసిన పెయింటింగ్స్ కాదు.

సుహాసినీ మణిరత్నం స్థాపించిన ‘నామ్’ అనే సంస్థ వారి క్యాలెండర్ ఫొటోషూట్ కోసం ప్రఖ్యాత పెయింటర్ రవి వర్మ చిత్రాల్ని రీక్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోలు పెయింటింగ్స్ కాదు. అవి నిజంగా ఫొటోలే. అదంతా ప్రముఖ ఫొటో గ్రాఫర్ వెంకట్ రామ్ మాయాజాలం. అచ్చుగుద్దినట్టు ఒరిజినల్ రవివర్మ పెయింటింగ్‌కి తగ్గట్టుగా ఫొటో షూట్ చేశారు. ఇందులో ప్రముఖ నటులు ఖుష్బూ, రమ్యకృష్ణ, శోభన, లిస్సీ లక్ష్మీ, నదియా, మంచు లక్ష్మి, సమంత, శృతి హాసన్‌, అథితీ రావు, ఐశ్వర్యా రాజేష్‌లు ఇలా ఒదిగిపోయారు. ప్రస్తుతం ఈ సంస్థ రిలీజ్ చేసిన ఫొటోలు.. సోషల్ మీడియలా ఫుల్‌గా వైరల్ అవుతోన్నాయి.

https://www.instagram.com/p/B8HJfxyBRYo/

Published On - 4:53 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu