గోవా కొత్త సీఎంగా ప్రమోద్‌ సావంత్?

|

Mar 18, 2019 | 7:42 PM

పనాజి: దేశ రాజకీయాల్లో సౌమ్యుడిగా, అజాతశత్రువుగా పేరొందిన బీజేపీ సీనియర్‌ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌ అంత్యక్రియలు ముగిశాయి. గోవాలోని మిరామిర్‌ బీచ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాని నరేం‍ద్ర మోదీతో పాటు బీజేపీ చీప్ అమిత్‌ షా సహా పలువురు నేతలు, వేలాది మంది కార్యకర్తలు పరీకర్‌‌కు అంతిమ వీడ్కోలు పలికారు పరీకర్ మరణంతో గోవాలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్‌ […]

గోవా కొత్త సీఎంగా ప్రమోద్‌ సావంత్?
Follow us on

పనాజి: దేశ రాజకీయాల్లో సౌమ్యుడిగా, అజాతశత్రువుగా పేరొందిన బీజేపీ సీనియర్‌ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌ అంత్యక్రియలు ముగిశాయి. గోవాలోని మిరామిర్‌ బీచ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాని నరేం‍ద్ర మోదీతో పాటు బీజేపీ చీప్ అమిత్‌ షా సహా పలువురు నేతలు, వేలాది మంది కార్యకర్తలు పరీకర్‌‌కు అంతిమ వీడ్కోలు పలికారు

పరీకర్ మరణంతో గోవాలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ మృదులా సిన్హాకు విఙ్ఞప్తి చేశారు. గోవా తదుపరి ముఖ్యమంత్రిగా భాజపా ఎమ్మెల్యే ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, గోవా భాజపా ఎమ్మెల్యేలు సాయంత్రం పనాజిలో సమావేశమయ్యారు. ప్రస్తుతం భాజపాకు 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్రపక్షాలతో కలిపి ఆ సంఖ్య 20గా ఉంది. 14మంది శాసన సభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ అతిపెద్దపార్టీగా కొనసాగుతోంది. సావంత్ ప్రస్తుతం గోవా శాసన సభ స్పీకర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.