‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’పై సెన్సార్ బోర్డుకు పోసాని విఙ్ఞప్తి

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై సెన్సార్ బోర్డుకు ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి విఙ్ఞప్తి చేశారు. వాస్తవంగా జరిగిన కథనే తెరకెక్కించారని, అందుకే ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా సర్టిఫికేట్ ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో ఏ సీన్‌ను కట్ చేసినా, దాన్ని ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ఈ సినిమాకు బయటకు రాకుండా చాలామంది చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై మరో నటుడు పృధ్వీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ […]

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’పై సెన్సార్ బోర్డుకు పోసాని విఙ్ఞప్తి
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 10:29 AM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై సెన్సార్ బోర్డుకు ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి విఙ్ఞప్తి చేశారు. వాస్తవంగా జరిగిన కథనే తెరకెక్కించారని, అందుకే ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా సర్టిఫికేట్ ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో ఏ సీన్‌ను కట్ చేసినా, దాన్ని ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ఈ సినిమాకు బయటకు రాకుండా చాలామంది చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

దీనిపై మరో నటుడు పృధ్వీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, బయోపిక్ అంటే వాస్తవాన్ని చెప్పాల్సిందేనని అన్నారు. నాడు ఏం జరిగిందో నేడు వర్మ అదే చెప్పబోతున్నారని తెలిపారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోని భాగాలతో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్‌లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.