పోలీసులపై విరుచుకుపడ్డ జల్లికట్టు అభిమానులు

చెన్నై: తమిళనాడు-కర్నాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ప్రజలు పోలీసులపై విచుకుపడ్డారు. పోలీసులకు జల్లకట్టు నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. వేలాది మందిన పోలీసులు తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు. లాఠీచార్జ్ కూడా చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. హోసూరు సమీపంలోని మదకొండపల్లిలో బుధవారం జల్లికట్టు నిర్వహించటానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తారనే ఉద్దేశ్యంతో భారీ […]

పోలీసులపై విరుచుకుపడ్డ జల్లికట్టు అభిమానులు
Follow us

|

Updated on: Feb 20, 2019 | 8:31 PM

చెన్నై: తమిళనాడు-కర్నాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ప్రజలు పోలీసులపై విచుకుపడ్డారు. పోలీసులకు జల్లకట్టు నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. వేలాది మందిన పోలీసులు తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు. లాఠీచార్జ్ కూడా చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళితే.. హోసూరు సమీపంలోని మదకొండపల్లిలో బుధవారం జల్లికట్టు నిర్వహించటానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తారనే ఉద్దేశ్యంతో భారీ ఏర్పాట్లు సైతం చేశారు. కానీ చివరి నిమిషంలో పోలీసులు జల్లికట్టుకు అనుమతి నిరాకరించారు. జల్లికట్టు నిర్వహించటానికి పోలీసులు అనుమతి నిరాకరించటం పెద్ద ఘర్షణకు దారితీసింది. జల్లికట్టును చూసేందుకు వచ్చిన వేలాది మందిని పోలీసులు తరిమి కొట్టడానికి లాఠీచార్జ్‌ చేయటంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు.