జమిలి ఎన్నికలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు… ఏపీ అసెంబ్లీకి ముందస్తు రావచ్చన్న జనసేనాని

దేశంలో లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై జనసేన వైఖరిని వెల్లడించారు. దాంతో పాటు వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగేది జోస్యం కూడా చెప్పారు.

జమిలి ఎన్నికలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు... ఏపీ అసెంబ్లీకి ముందస్తు రావచ్చన్న జనసేనాని
Follow us
Rajesh Sharma

|

Updated on: Nov 18, 2020 | 7:20 PM

Pawankalyan sensational comments on Jamili elections: జమిలి ఎన్నికలపై జోస్యం చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చని ఆయన అంటున్నారు. తనకు కేంద్రం నుంచి వున్న సమాచారం ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో కాకుండా ముందుగానే జరగవచ్చని పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో పార్టీ వర్గాలనుద్దేశించి మాట్లాడిన పవన్ కల్యాణ్.. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ దేశం అంతా ఒకేసారి ఎన్నికలు రావాలని నా అభిప్రాయం.. చాలా రాష్ట్రాలు ఇదే కోరుకుంటున్నాయి.. 2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.. నాకొచ్చిన సమాచారం ప్రకారం ముందస్తు ఎన్నికలు రావచ్చు…’’ అని పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం జనసేన క్రియాశీల సభ్యులనుద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రచ్చ రగులుకున్న తరుణంలో పవన్ కల్యాణ్ జమిలి ఎన్నికల గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది.

గత కొంత కాలంగా బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో చట్టం చేసేందుకు న్యాయపరమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ జమిలికి జై కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ALSO READ: వచ్చే రెండ్రోజులు వానలే వానలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ALSO READ: జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ చూపు.. డిసెంబర్‌లో కీలక భేటీ

ALSO READ: తలసాని 104 అంటే కేసీఆర్ 105 అన్నారు.. బల్దియా ఫలితంపై కేసీఆర్ జోస్యం

ALSO READ: హైదరాబాద్‌లో ఎలెక్షన్ కోడ్ స్టార్ట్.. వరద సాయానికి ఈసీ బ్రేక్

ALSO READ: ఆ విషయాన్ని మైండ్‌లోంచి తీసేయ్యండి.. పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం

ALSO READ: వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ

ALSO READ: ఆన్‌లైన్ బెట్టింగులపై తమిళ సర్కార్ సంచలన నిర్ణయం