నేటి నుంచి నగరంలో పార్కుల ఓపెన్

|

Sep 26, 2020 | 3:47 PM

హైదరాబాద్ లో పార్కులు ఆరు నెలల లాక్ డౌన్ తర్వాత నేటి నుంచి సందర్శకులతో కళకళలాడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు నుంచి నగరంలో పార్కులను ఓపెన్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలన్నింటిని దృష్టిలో ఉంచుకొని సందర్శకులను ముందుగానే శానిటైజ్ చేసి వారికి మాస్క్ లు ఉంటేనే లోనికి అనుమతిస్తామని పార్క్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని పార్కులు, నగరంలోని చిన్న చిన్న కాలనీ పార్క్ లకు కూడా ఇది వర్తిస్తుంది. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ […]

నేటి నుంచి నగరంలో పార్కుల ఓపెన్
Follow us on

హైదరాబాద్ లో పార్కులు ఆరు నెలల లాక్ డౌన్ తర్వాత నేటి నుంచి సందర్శకులతో కళకళలాడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు నుంచి నగరంలో పార్కులను ఓపెన్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలన్నింటిని దృష్టిలో ఉంచుకొని సందర్శకులను ముందుగానే శానిటైజ్ చేసి వారికి మాస్క్ లు ఉంటేనే లోనికి అనుమతిస్తామని పార్క్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని పార్కులు, నగరంలోని చిన్న చిన్న కాలనీ పార్క్ లకు కూడా ఇది వర్తిస్తుంది. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ముందు జాగ్రత్తలు చెప్పి.. మార్నింగ్, ఈవినింగ్ వాకర్స్ కు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పార్క్స్ మాలిని తెలిపారు.