దేశ ఆర్థిక పరిస్థితిని కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ పరిస్థితి పూర్తిగా అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాన్ని గాడిలో పెట్టేందుకు బహుముఖ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇందు కోసం విదేశీ పెట్టుబడులను భారీ ఎత్తున ఆకర్షించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, హోం శాఖల మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు ప్రధానమంత్రి మోదీ. విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక ప్రధాన మార్గమని సహచర మంత్రులకు ప్రధానమంత్రి మోదీ ఉద్బోధించారు. సులభతర పారిశ్రామిక, వాణిజ్య విధానాల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. పారిశ్రామిక వాడల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని సమావేశం నిర్ణయించింది.
దేశీయ తయారీ రంగంలోకి విదేశీ పెట్టుబడులు సమకూర్చడంపై చర్చించారు. వివిధ మంత్రిత్వ శాఖలు తలపెట్టిన సంస్కరణలు వేగవంతం చేయాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత కాలవ్యవధిలో పరిశ్రమల స్థాపనకు అన్ని అనుమతులు లభించేలా చర్యలు తీసుకోవాలని తలపెట్టారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే వ్యూహాలపై మేధోమథనం నిరంతరం కొనసాగాలని మోదీ ఆకాంక్షించారు. ముఖ్యంగా అంతర్జాతీయ విపణిలో చైనా దేశపు ఖ్యాతి పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని, చైనా నుంచి తరలి పోయే పరిశ్రమలు మన దేశానికి వచ్చేలా అన్ని అంశాలను అనుకూలంగా మలుచుకోవాలని ప్రధానమంత్రి ఈ భేటీలో అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్
Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం
Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్
Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం
Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!
Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే
Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం
Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం
Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి
Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు