చెన్నై టాక్సీ గోదాములో అగ్ని ప్రమాదం, 200కార్లు బూడిద

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:52 PM

బెంగళూరు కార్ల ప్రమాదం మరువకముందే అలాంటి ఘటనే చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని స్థానిక పోరూరులోని కార్ల గోదాము వద్ద ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 200 లగ్జరీ కార్లు కాలిబూడిదయ్యాయి. రూ.50 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించినట్లు అనధికారిక సమాచారం. బెంగళూరు ఎయిర్‌షో సందర్భంగా కార్‌ పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించి 277 కార్లు బుగ్గిపాలైన సంగతి తెలిసిందే. చెన్నై పోరూరు శ్రీరామచంద్రా వైద్య విశ్వవిద్యాలయం సమీపంలో పారిశ్రామికవేత్త […]

చెన్నై టాక్సీ గోదాములో అగ్ని ప్రమాదం, 200కార్లు బూడిద
Follow us on

బెంగళూరు కార్ల ప్రమాదం మరువకముందే అలాంటి ఘటనే చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని స్థానిక పోరూరులోని కార్ల గోదాము వద్ద ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 200 లగ్జరీ కార్లు కాలిబూడిదయ్యాయి. రూ.50 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించినట్లు అనధికారిక సమాచారం. బెంగళూరు ఎయిర్‌షో సందర్భంగా కార్‌ పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించి 277 కార్లు బుగ్గిపాలైన సంగతి తెలిసిందే. చెన్నై పోరూరు శ్రీరామచంద్రా వైద్య విశ్వవిద్యాలయం సమీపంలో పారిశ్రామికవేత్త శివశంకరన్‌కు చెందిన కార్ల గోదాము ఉంది. ఆయన నడుపుతున్న యూటూ కాల్‌టాక్సీ సంస్థకు చెందిన కార్లను ఆ ప్రాంతంలో రోజూ వందల సంఖ్యలో పార్కింగ్‌ చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పార్కింగ్‌ మైదానంలో ఉన్న రెండు కార్లకు నిప్పంటుకుంది. క్షణాల్లో పక్కనున్న కార్లకు కూడా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో నిస్సాన్‌ సంస్థకు చెందిన 200 కార్లు దగ్ధమయ్యాయి. శివశంకరన్‌ త్వరలో కాల్‌టాక్సీ సంస్థను నడిపేందుకు ఈ కార్లను కొనుగోలు చేశారని తెలిసింది. కార్లు పార్క్‌ చేసిన ప్రాంతంలో టన్నుల కొద్దీ ఎండిన చెరకు చెత్త నిల్వలు, ఆ ప్రాంతంలో పారబోసిన రసాయనిక వ్యర్థాలు అధికంగా ఉండటంతో అన్ని కార్లకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.