AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masks must ఆ రాష్ట్రాల్లో మాస్కుల ధారణ కంపల్సరీ.. ఎందుకంటే?

దేశంలో కరోనా మహమ్మారి ఎప్పటికి పూర్తిగా కంట్రోల్‌లోకి వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టంగా మారింది. ఒకచోట తగ్గుతుందనుకుంటుంటే.. మరోచోట కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో రికార్డవుతున్నాయి. మాస్కుల ధారణ ప్రస్తుతం కీలకంగా మారింది.

Masks must ఆ రాష్ట్రాల్లో మాస్కుల ధారణ కంపల్సరీ.. ఎందుకంటే?
Rajesh Sharma
|

Updated on: Apr 10, 2020 | 2:11 PM

Share

Wearing masks mandatory in five Indian states: దేశంలో కరోనా మహమ్మారి ఎప్పటికి పూర్తిగా కంట్రోల్‌లోకి వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టంగా మారింది. ఒకచోట తగ్గుతుందనుకుంటుంటే.. మరోచోట కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో రికార్డవుతున్నాయి. కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ మరో నాలుగైదు రోజుల్లో ముగుస్తుండగా దాన్ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్‌తో ప్రమేయం లేకుండా ప్రతీ పౌరుడు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని అంశాలు ఇపుడు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కీలకంగా మారాయి.

కరోనా నియంత్రణలో ప్రతీ ఒక్కరు సజెస్ట్ చేస్తున్న అంశాలు మూడు. ఒకటి మాస్కు ధరించడం, రెండోది సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయడం, మూడోది.. తరచూ చేతులు కడుక్కోవడం… ఈ మూడు అంశాల్లో చివరి రెండు ఎవరికి వారు పాటిస్తున్నా.. పాటించకపోయినా బయటికి పెద్దగా తెలియదు. కానీ మొదటిది.. అంటే మాస్కు ధరించడం మాత్రం ఎవరైనా చూడగానే కనిపెట్టేసే నిబంధన. పాటిస్తున్నారా లేదా తెలుసుకునేందుకు వారి మొహంపై మాస్కు వుందా లేదా చూస్తే సరిపోతుంది.

కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత మాస్కు ధరించడం అవసరమా కాదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపించినా.. చివరికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ మొదటివారంలో జారీ చేసిన సర్క్యులర్ ద్వారా మాస్కు ధారణ కంపల్సరీ అయి పోయింది. బహిరంగ ప్రదేశాలలో సంచరించే వారి వైరస్ ప్రభావం వున్నా లేకపోయినా విధిగా మాస్కు ధరించాలన్నది కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ సారాంశం.

ఈ క్రమంలో అయిదు రాష్ట్రాలు తమ పరిధిలో మాస్కుధారణను కంపల్సరీ చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. వీటిలో మొదటిది… దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన మహారాష్ట్ర. ముఖ్యంగా ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కరోనా విజృంభిస్తోంది. ఇంకోవైపు పుణెలోను కరోనా తాండవం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే (ఏప్రిల్ 10వ తేదీ నాటికి) కరోనా పాజిటివ్ కేసులు వేయి దాటింది. జనసాంద్రత అధికంగా వుండే నగరాలకు కరోనా భయం పొంచి వుంది. దాంతో మహారాష్ట్రలోని ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడం కంపల్సరీ చేసింది.

ముంబై తర్వాత అత్యధిక జనసాంద్రత వుండేది దేశ రాజధాని ఢిల్లీ. దానికి తోడు తబ్లిఘీ లాంటి సంస్థలు సదస్సులు నిర్వహించడం వల్ల ఢిల్లీలోను వైరస్ వ్యాప్తి పెద్దగానే వుంది. దాంతో ఢిల్లీ నగరంలో మాస్కు ధారణ కంపల్సరీ చేసేసింది అక్కడి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇటు.. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లోను మాస్కు ధారణ కంపల్సరీ చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. యుపిలో మొత్తం పదిహేను జిల్లాలను 100 శాతం మూసి వేశారు.

మరోవైపు కేంద్రం కంటే ముందుగానే ఏప్రిల్ నెలాఖరు దాకా లాక్ డౌన్‌ని పొడిగించిన ఒడిషా ప్రభుత్వం కూడా రాష్ట్రంలో మాస్కులను ధరించడం తప్పనిసరి చేసింది. మరోవైపు చండిఘడ్‌ (రెండు రాష్ట్రాల రాజధాని)లోను మాస్కుల ధారణను స్థానిక ప్రభుత్వం తప్పనిసరి చేసేసింది. ఇదే యోచనలో మరికొన్ని రాష్ట్రాలున్నట్లు తెలుస్తుండగా.. కేంద్రమే దేశవ్యాప్తంగా కనీసం నెల రోజుల పాటు మాస్కు ధారణను కంపల్సరీ చేసే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు.