జగన్ విజయం.. మహేశ్ బాబు ట్వీట్

| Edited By:

May 24, 2019 | 5:46 PM

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించింది. మొత్తం 175 స్థానాలకు గానూ 151 సీట్లను గెలిచి.. భారీ మెజారిటీని సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీంతో సర్వత్రా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు జగన్‌కు తమ అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు, జగన్ విజయంపై స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన […]

జగన్ విజయం.. మహేశ్ బాబు ట్వీట్
Follow us on

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించింది. మొత్తం 175 స్థానాలకు గానూ 151 సీట్లను గెలిచి.. భారీ మెజారిటీని సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీంతో సర్వత్రా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు జగన్‌కు తమ అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు, జగన్ విజయంపై స్పందించారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన జగన్‌కు కంగ్రాట్స్. మీ ఆధ్యర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెంది, అద్భుత విజయాలను సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టారు. కాగా మహేశ్ బాబు చిన్నాన్న, నిర్మాత ఆది శేషగిరి రావు ఎన్నికల ముందు వరకు వైసీపీలోనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే.