కమలం గూటికి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు

| Edited By:

Mar 12, 2019 | 3:23 PM

మహారాష్ట్ర : సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. మొన్న గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. అటు బీహార్ లో కూడా కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మహారాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు సుజయ్ పాటిల్ […]

కమలం గూటికి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు
Follow us on

మహారాష్ట్ర : సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. మొన్న గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. అటు బీహార్ లో కూడా కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మహారాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు సుజయ్ పాటిల్ బీజేపీలో చేరారు. సుజయ్ పాటిల్ కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తనకు కాంగ్రెస్ పార్టీ అహ్మద్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో సుజయ్ పాటిల్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ 22-26 భాగస్వామ్య పద్దతిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అహ్మద్ నగర్ స్థానాన్ని ఎన్‌సీపీ పార్టీకే కేటాయించింది. అయితే ఈ సారి అహ్మద్‌నగర్ స్థానాన్ని సుజయ్ పాటిల్ ఆశిస్తున్నా..ఎన్‌సీపీ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. దీంతో సుజయ్ కాషాయ కండువా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.