నామినేషన్లకు ముందు.. పూజలు చేసిన సోనియా, స్మృతి ఇరానీ

లక్నో : ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ఇవాళ నామినేషన్ వేస్తున్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తమ నివాసాల్లో ఉదయం ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. సోనియాగాంధీ తన నివాసంలో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ వాద్రా సైతం పాల్గొన్నారు. రాయబరేలి నుంచి సోనియా గాంధీ ఈ సాయంత్రం నామినేషన్ వేయనున్నారు. వరుసగా ఐదోసారి రాయబరేలిని నిలబెట్టుకోవాలని సోనియాగాంధీ పట్టుదలగా ఉన్నారు. మే 6న జరిగే పోలింగ్‌లో […]

నామినేషన్లకు ముందు.. పూజలు చేసిన సోనియా, స్మృతి ఇరానీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 11, 2019 | 2:44 PM

లక్నో : ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ఇవాళ నామినేషన్ వేస్తున్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తమ నివాసాల్లో ఉదయం ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. సోనియాగాంధీ తన నివాసంలో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ వాద్రా సైతం పాల్గొన్నారు. రాయబరేలి నుంచి సోనియా గాంధీ ఈ సాయంత్రం నామినేషన్ వేయనున్నారు. వరుసగా ఐదోసారి రాయబరేలిని నిలబెట్టుకోవాలని సోనియాగాంధీ పట్టుదలగా ఉన్నారు. మే 6న జరిగే పోలింగ్‌లో రాయబరేలి పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. సోనియాగాంధీకు ప్రత్యర్థిగా ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన రాయబరేలి నుంచి సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు.

కాగా, ఈ సాయంత్రమే అమేథి నుంచి బీజేపీ తరఫున నామినేషన్ వేయనున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉదయం తన నివాసంలో భర్త జుబిన్ ఇరానీతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న అనంతరం స్మృతి ఇరానీ తన నామినేషన్ సమర్పించనున్నారు. అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అయితే 2014 ఎన్నికల్లోనూ రాహుల్‌తో పోటీ చేసి లక్ష ఓట్ల తేడాతో స్మృతి ఇరానీ ఓడిపోయారు. అయితే, దీనికంటే ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రం ఆమె గణనీయంగా తగ్గించగలిగారు. రాహుల్ ఈసారి అమేథితో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంతో అమేథీలో తన గెలుపు నల్లేరు మీద నడకేనని స్మృతి ఇరానీ అంచనా వేస్తున్నారు.