ఆ దేశంలో పెళ్లికొడుకులకు బంపరాఫర్

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ అమ్మాయిల శాతం తగ్గుతూ వస్తోంది. కానీ ఆ దేశంలో మాత్రం మహిళల సంఖ్య ఏడాదేడాదికి పెరుగుతూనే ఉంది. దీంతో వారికి పెళ్లికొడుకులు తక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని పాలిస్తోన్న రాజు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మేజర్ అయిన ప్రతి పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. ఒకవేళ అలా చేసుకోని క్రమంలో వారికి జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరించాడు. […]

ఆ దేశంలో పెళ్లికొడుకులకు బంపరాఫర్
TV9 Telugu Digital Desk

| Edited By:

May 14, 2019 | 4:39 PM

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ అమ్మాయిల శాతం తగ్గుతూ వస్తోంది. కానీ ఆ దేశంలో మాత్రం మహిళల సంఖ్య ఏడాదేడాదికి పెరుగుతూనే ఉంది. దీంతో వారికి పెళ్లికొడుకులు తక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని పాలిస్తోన్న రాజు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మేజర్ అయిన ప్రతి పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. ఒకవేళ అలా చేసుకోని క్రమంలో వారికి జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరించాడు. ఇందుకోసం మే చివరి వరకు సమయాన్ని ఇచ్చాడు.

ఆఫ్రికాలో ‘కన్యల దేశం’గా పిలవబడే స్వాజిలాండ్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో స్త్రీ- పురుష జనాభా మధ్య సమతూకం కోసం ఒక్కొక్కరు కనీసం రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని ఆ దేశ రాజు మెస్వాతి-3 ఆఙ్ఞలు జారీ చేశాడు. అంతేకాదు ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకునేవారికి పెళ్లి ఖర్చులతో పాటు ఆ భార్యలకు ఇళ్లను కూడా ప్రభుత్వం ఇస్తుందని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇంత కఠిన ఆదేశాలు జారీ చేసిన మెస్వాతి-3కు 15మంది భార్యలు, 25మంది సంతానం ఉండగా.. ఆయన తండ్రికి 70మంది భార్యలు, 150మందికి పైగా సంతానం ఉన్నారు. ఇదిలా ఉంటే మెస్వాతి నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశం మరింత పేదరికంలోకి జారిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu