బ్రేకింగ్: కమలనాథులకు కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారాన్ని మరింత పీక్ లెవెల్‌కు చేర్చారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్షన్ల వ్యవహారం కీలకంగా మారడంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు కేసీఆర్.

బ్రేకింగ్: కమలనాథులకు కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్

Updated on: Oct 31, 2020 | 5:28 PM

KCR open challenge to BJP leaders: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ విషయంలో టీఆర్ఎస్ పార్టీగానీ, తాను గానీ చెప్పేది అబద్దమని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు సీఎం కేసీఆర్. జనగామ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పంపిణీ అవుతున్న పెన్షన్లలో హెచ్చు శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మొత్తం 38 లక్షల 64 వేల 751 మందికి ఒక్కొక్కరికి రెండు వేల 16 రూపాయలను పెన్షన్లుగా ఇస్తుందని, అందుకు సుమారు 11 వేల రూపాయలను తమ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో కేంద్రం వాటా కేవలం 105 కోట్ల రూపాయలేనని వెల్లడించిన కేసీఆర్.. తాను చెప్పేది అసత్యమని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేంద్రం కేవలం 6 లక్షల 95 వేల మందికి 200 రూపాయల చొప్పున కేటాయిస్తోందని.. కేంద్రం వాటా కేవలం 105 కోట్ల రూపాయలేనని ఆయన వివరించారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ నేతలు అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారని.. కానీ వారి ఆటలు సాగవని.. దుబ్బాకలో గులాబీ అభ్యర్థే ఘన విజయం సాధిస్తారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు ఓట్లు మాత్రమే కావాలని, ప్రజల ఇబ్బందులు, వారి సంక్షేమం పట్టడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోద ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రతీ ఒక్కరు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

ALSO READ: 60 స్కాములు..30వేల కోట్ల దోపిడీ… నితీశ్‌పై మోదీ ధ్వజం!

ALSO READ:  సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు

ALSO READ: పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు

ALSO READ: ఒక్క కారు..మూడు బైకులు.. ఒకేసారి ఢీ