తలసాని 104 అంటే కేసీఆర్ 105 అన్నారు.. గ్రేటర్ విజయంపై గులాబీ ధీమా.. బల్దియా ఫలితంపై కేసీఆర్ జోస్యం

|

Nov 18, 2020 | 4:30 PM

ఆల్ అఫ్ ఎ సడన్‌గా వచ్చిపడిన బల్దియా ఎన్నికల సమరంలో విజయం టీఆర్ఎస్‌దేనని జోస్యం చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. టీఆర్ఎస్ సొంతంగా...

తలసాని 104 అంటే కేసీఆర్ 105 అన్నారు.. గ్రేటర్ విజయంపై గులాబీ ధీమా.. బల్దియా ఫలితంపై కేసీఆర్ జోస్యం
Follow us on

KCR differs with Talasani Srinivas: ఆల్ అఫ్ ఎ సడన్‌గా వచ్చిపడిన బల్దియా ఎన్నికల సమరంలో విజయం టీఆర్ఎస్‌దేనని జోస్యం చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. టీఆర్ఎస్ సొంతంగా 105 డివిజన్లలో విజయఢంకా మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, విజయం ఖాయమన్న భావనతో నిర్లక్ష్యం వద్దని కేసీఆర్ పార్టీ క్యాడర్‌ను హెచ్చరించారు.

బుధవారం తెలంగాణభవన్‌లో పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లతో భేటీ అయ్యారు గులాబీ దళపతి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని, ప్రచారాంశాలను పార్టీ వర్గాలకు ఉపదేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ ఫలితం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమేనని ఘంటాపథంగా చాటారు. టీఆర్ఎస్ పార్టీకి 105 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

ప్రచారంశాలపై వ్యూహాలను వివరించిన కేసీఆర్.. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్‌లను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతోందని, ఈ విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు వివరించడం ద్వారా బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీజేపీ నేతలు చేసే అసత్య ప్రచారాన్ని మీడియా, సోషల్ మీడియాతో పాటు ప్రచార సభల్లోను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం సాధించిన సక్సెస్‌ను ప్రజలకు వివరించాలన్నారు.

ALSO READ: హైదరాబాద్‌లో ఎలెక్షన్ కోడ్ స్టార్ట్.. వరద సాయానికి ఈసీ బ్రేక్

ALSO READ: ఆ విషయాన్ని మైండ్‌లోంచి తీసేయ్యండి.. పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం

ALSO READ: వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ