రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతిమయంగా మారిన రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం వుందని, అందుకోసం వచ్చే అసెంబ్లీ సెషన్‌లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ సిబ్బంది.. సంస్కరణలను వ్యతిరేకించడం విడ్డూరంగా వుందన్నారు. రెవెన్యూ చట్టంపై చర్చించేందుకు సంబంధిత ఉద్యోగ సంఘాలను త్వరలో చర్చలకు పిలుస్తామని చెప్పారు.
కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా ప్రస్తుత ఉద్యోగులు పనిచేస్తే సరే.. లేకపోతే ఇతర రంగాల ఉద్యోగులను రెవెన్యూ శాఖకు షిఫ్టు చేసి పనిచేయిస్తామన్నారు సీఎం కేసీఆర్. కొత్త రెవెన్యూ చట్టంతోపాటు ఇటీవల తెచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం, నూతన మునిసిపల్ చట్టాలను పక్కాగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.