ఉత్కంఠ రేపుతున్న కన్నడ పాలి”ట్రిక్స్”

| Edited By:

Jul 22, 2019 | 7:28 PM

గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా సాగుతున్న కన్నడ రాజీకీయాలు కీలక మలుపు తిరిగాయి.15మంది కాంగ్రెస్ జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో కుమారస్వామిప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. సోమవారం బలపరీక్ష జరుగుతుందని అంతా భావిస్తున్న తరుణంలో సీఎం కుమారస్వామి మరోసారి స్పీకర్ రమేశ్‌కుమార్‌‌తో భేటీ అయ్యారు. బలపరీక్షకు సిద్ధం కావాలని స్పీకర్ సూచించడంతో ఓటింగ్‌కు మరికొంత సమయం కావాలని సీఎం కోరారు. మరోవైపు ఇవాళే బలపరీక్ష పూర్తిచేస్తామని చెప్పడంతో సభలో గందరగోళం నెలకొంది. […]

ఉత్కంఠ రేపుతున్న కన్నడ పాలిట్రిక్స్
Follow us on

గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా సాగుతున్న కన్నడ రాజీకీయాలు కీలక మలుపు తిరిగాయి.15మంది కాంగ్రెస్ జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో కుమారస్వామిప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. సోమవారం బలపరీక్ష జరుగుతుందని అంతా భావిస్తున్న తరుణంలో సీఎం కుమారస్వామి మరోసారి స్పీకర్ రమేశ్‌కుమార్‌‌తో భేటీ అయ్యారు. బలపరీక్షకు సిద్ధం కావాలని స్పీకర్ సూచించడంతో ఓటింగ్‌కు మరికొంత సమయం కావాలని సీఎం కోరారు. మరోవైపు ఇవాళే బలపరీక్ష పూర్తిచేస్తామని చెప్పడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే బీజేపీ సభ్యులు తక్షణం ఓటింగ్ చేపట్టాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

ప్రస్తుతం జేడీఎస్ -కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి స్పీకర్‌ సహా 102మంది సభ్యుల బలముంది. అదే సమయంలో ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు జత చేరడంతో బీజేపీ బలం 107కు పెరిగింది. ఇప్పుటికిప్పుడు బలపరీక్ష జరిగితే 105 మంది సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇప్పిటికే 15 మంది రాజీనామా చేయగా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఓటింగ్ జరిగితే సంకీర్ణ ప్రభుత్వం కూలి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేకపోతే రాజకీయ సంక్షోభం ఏర్పడే పరిస్థితులు వస్తే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా లేకపోలేదు.

తాజా పరిణామాల నేపధ్యలో స్పీకర్ రమేశ్‌కుమార్ బీజేపీ సభ్యులు సునీల్ కుమార్, బస్వరాజు బొమ్మై, సీటీ రవి, జేడీఎస్ సభ్యులు సారా మహేశ్, హెడీ రేవణ్నతదితరులతో తన ఛాంబర్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.