కర్ణాటక శాసనసభా స్పీకర్ రమేశ్‌కుమార్ బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి 9 గంటలకు వరకు బలపరీక్షకు టైమ్ ఇచ్చినట్టుగా తేల్చిచెప్పారు. తనకు కొంత సమయం కావాలని విఙ్ఞప్తి చేసిన సీఎం కుమారస్వామిపై ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ఇక ఎలాంటి వాయిదాలకు తావు లేదని స్పష్టం చేశారు. వాయిదాల కోసం మరింత ఒత్తిడి చేస్తే తానే రాజీనామా చేస్తానంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే రేపు సుప్రీం కోర్టులో పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నందున బలపరీక్షను రేపటికి వాయిదా వేయాలని కోరిన జేడీఎస్ వినతిని స్పీకర్ తిరస్కరించారు. మరోవైపు స్పీకర్‌తో విరామ సమయంలో భేటీ అయిన బీజేపీ సభ్యులు మాత్రం బలపరీక్షకు తాము రెడీ అంటూ ఇవాళే నిర్వహించాలని పట్టుబట్టారు.