జనసేన టిక్కెట్ కోసం పవన్ దరఖాస్తు

విజయవాడ: తనకు జనసేన పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టిక్కెట్ కావాలని కోరుతూ పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఇదేంటి పార్టీ అధ్యక్షుడు పవనే కదా అనుకుంటున్నారా? కావొచ్చు కానీ దరఖాస్తు చేసిన మాట మాత్రం వాస్తవం. ఈ రోజు విజయవాడలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఇందులో అభ్యర్ధుల ఎంపికపై చర్చించారు. ఎలాంటి అంశాలను ఫాలో అవ్వాలి? ఏ విధంగా అభ్యర్ధుల ఎంపిక జరగాలో ఖరారు చేశారు. ప్రజారాజ్యం […]

జనసేన టిక్కెట్ కోసం పవన్ దరఖాస్తు

విజయవాడ: తనకు జనసేన పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టిక్కెట్ కావాలని కోరుతూ పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఇదేంటి పార్టీ అధ్యక్షుడు పవనే కదా అనుకుంటున్నారా? కావొచ్చు కానీ దరఖాస్తు చేసిన మాట మాత్రం వాస్తవం. ఈ రోజు విజయవాడలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఇందులో అభ్యర్ధుల ఎంపికపై చర్చించారు.

ఎలాంటి అంశాలను ఫాలో అవ్వాలి? ఏ విధంగా అభ్యర్ధుల ఎంపిక జరగాలో ఖరారు చేశారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవం దృష్ట్యా ఎక్కడా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వొద్దని, కష్టపడుతూ నిబద్ధత కలిగి ఉండేవారికే ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ విషయంలో తనకు కూడా మినహాయింపులేదని చెబుతూ తాను కూడా అభ్యర్ధుల ఎంపిక కమిటీకి తన దరఖాస్తును సమర్పించారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు ప్రముఖ జనసేన నాయకులు పాల్గొన్నారు.

Published On - 7:50 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu