ఇకపై అక్కడ రెపరెపలాడేది త్రివర్ణ పతాకం ఒక్కటే

| Edited By:

Aug 26, 2019 | 3:31 AM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు జమ్ము సెక్రటేరియట్ మీద ఎగిరిన రెండు పతకాల్లో ఇకపై భారత త్రివర్ణ పతాకమొక్కటే ఎగరనుంది. తాజా నిర్ణయంతో సెక్రెటేరియట్‌పై నుంచి కశ్మీర్ పతాకాన్ని తొలగించారు. అక్టోబర్ 31 తరువాత రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై కూడా కశ్మీర్ పతాకాన్ని తీసేయాలని కేంద్రం ఆదేశించింది. ఇకపై కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తెరమరుగైంది. ఇప్పటివరకు మన త్రివర్ణ పతాకంతో పాటు జమ్ము కశ్మీర్ పతాకం […]

ఇకపై అక్కడ  రెపరెపలాడేది త్రివర్ణ పతాకం ఒక్కటే
Follow us on

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు జమ్ము సెక్రటేరియట్ మీద ఎగిరిన రెండు పతకాల్లో ఇకపై భారత త్రివర్ణ పతాకమొక్కటే ఎగరనుంది. తాజా నిర్ణయంతో సెక్రెటేరియట్‌పై నుంచి కశ్మీర్ పతాకాన్ని తొలగించారు. అక్టోబర్ 31 తరువాత రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై కూడా కశ్మీర్ పతాకాన్ని తీసేయాలని కేంద్రం ఆదేశించింది. ఇకపై కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తెరమరుగైంది.

ఇప్పటివరకు మన త్రివర్ణ పతాకంతో పాటు జమ్ము కశ్మీర్ పతాకం కూడా కనిపించేది. ఇకపై అది ఎక్కడా కనిపించే దాఖలు లేవు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రత్యేక జెండా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక హక్కులు కోల్పోయింది. మిగతా రాష్ట్రాల ప్రజలకు ఉన్న హక్కులే కశ్మీర్‌ ప్రజలకు ఉంటాయి.

గతంలో తన కారుపై కశ్మీర్‌ పతాకాన్ని తీసేసి సంచలనం సృష్టించారు అప్పటి జమ్ముకశ్మీర్‌ డిప్యూటీ సీఎం , బీజేపీ నేత నిర్మల్‌సింగ్‌ . కశ్మీర్‌ ముమ్మాటికి భారత్‌లో అంతర్భాగమని , అలాంటప్పడు ప్రత్యేక జెండా ఎందుకని ఆయన అప్పట్లోనే ప్రశ్నించారు. కాని ఇప్పుడు ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ పతాకం ఇక కనపడదు. బీజేపీ నేతలు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు