AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు నుంచి గ్రామాల పర్యటన.. వెల్లడించిన సీఎం

కరోనా ప్రభావం, లాక్ డౌన్ అమలు కారణంగా నిలిచిపోయిన జిల్లాల పర్యటనలను ఆగస్టు నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆగస్టు నెల నుంచి జిల్లాల్లో మరీ ముఖ్యంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తానని ముఖ్యమంత్రి గురువారం జరిగిన కేబినెట్ భేటీలో...

ఆగస్టు నుంచి గ్రామాల పర్యటన.. వెల్లడించిన సీఎం
Rajesh Sharma
|

Updated on: Jun 11, 2020 | 6:50 PM

Share

కరోనా ప్రభావం, లాక్ డౌన్ అమలు కారణంగా నిలిచిపోయిన జిల్లాల పర్యటనలను ఆగస్టు నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆగస్టు నెల నుంచి జిల్లాల్లో మరీ ముఖ్యంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తానని ముఖ్యమంత్రి గురువారం జరిగిన కేబినెట్ భేటీలో సూత్రప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. అయితే, తన పర్యటనలో భాగంగా ప్రజలను కలిసినపుడు సంక్షేమ పథకాలు తమకు చేరలేదని ఎవరూ కామెంట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులదేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరితే ఎలాంటి ఫిర్యాదు రావని, ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఆయన మంత్రులకు హితోపదేశం చేసినట్లు సమాచారం. కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధివిధానాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కూడా తన జిల్లాల పర్యటన గురించి ముఖ్యమంత్రి మాట్లాడినట్లు చెబుతున్నారు.

లబ్దిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా జరగాలని, వైసీపీకి ఓటు వేయని వారికి కూడా ప్రయోజనాలు చేరేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చొరవ చూపాలని ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. ”పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలి. ప్రకటించిన సమయంలోగా సకాలానికే పథకాలు అందాలి. ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించకూడదు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెన్షన్లు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలి. మొదట వీటిపై దృష్టి పెట్టాలి. ఆగస్ట్‌ నుంచి గ్రామాల్లో పర్యటిస్తా. అప్పుడు ఎవరి నుంచి కూడా తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదు.” అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

Follow Us
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే