టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆఫీసులో ఐటీ దాడులు కలకలం రేపాయి. నిన్న మధ్యాహ్నం నుంచి సోదాలు చేసింది ఐటీ శాఖ. జయదేవ్ ఆఫీస్ అకౌంటెంట్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు ఐటీ అధికారులు. ఆదాయ వివరాలు, ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న లెక్కలపై ఆరా తీసినట్టు సమాచారం. అర్థరాత్రి వరకు జయదేవ్ అకౌంటెంట్ గుర్రపు నాయుడును ఐటీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం తర్వాత విడిచిపెట్టినట్లు సమాచారం. ఐటీ దాడులపై గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం కావాలనే దాడులు చేయిస్తోందంటూ మండిపడ్డారు.