Corona Deaths : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ ముగిసి.. ఆన్‌లాక్ 4.0 నడుస్తున్నా.. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్నాయి. ప్రతి రోజు వెయి పాజిటివ్ కేసుకు పైగా నమోదవుతున్నాయి. అంతే కాదు మృతుల సంఖ్య కూడా పదుల సంఖ్యలో ఉంటున్నాయి.
తాజాగా ఇదే బాటలో మధ్యప్రదేశ్ కూడా చేరింది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం రోజు కూడా రాష్ట్రంలో కొత్తగా 1,694 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 73,574 కోవిడ్ కేసులు నమోదు కాగా… ప్రస్తుతం 16,115 మంది కరోనా బాధితులకు చికిత్స పొందుతున్నారు.
ఇవాళ కరోనా వల్ల 29 మంది మృతి చెందగా, మొత్తం 1,572 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 1,238 మంది డిశ్చార్జ్ అవగా, మొత్తం 55,887 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.