మాఘ పౌర్ణమి ప్రాశస్త్య౦

| Edited By:

Feb 19, 2019 | 4:57 PM

మాఘస్నానం ఆరోగ్య దాయక౦…పుణ్య ఫల౦. దీనికి ముఖ్య కారణం సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే. ఈ సమయంలో శివకేశవులు ఇరువురినీ పూజించాలనీ, దాన ధర్మాలు చేయాలనీ సాధ్యమైనంత వరకు దైవచింతనతో గడపాలని పండితులు చెబుతారు. ఈ మాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజులలో అయినా చేయాలి. ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందన్న నమ్ముతారు. మాఘ‌ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో […]

మాఘ పౌర్ణమి ప్రాశస్త్య౦
Follow us on

మాఘస్నానం ఆరోగ్య దాయక౦…పుణ్య ఫల౦. దీనికి ముఖ్య కారణం సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే. ఈ సమయంలో శివకేశవులు ఇరువురినీ పూజించాలనీ, దాన ధర్మాలు చేయాలనీ సాధ్యమైనంత వరకు దైవచింతనతో గడపాలని పండితులు చెబుతారు. ఈ మాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజులలో అయినా చేయాలి. ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందన్న నమ్ముతారు.

మాఘ‌ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులోగానీ, లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం.

స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. వైష్ణవ, శివాలయానికి గానీ వెళ్లి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు, దోషాలు నశించి, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా తెలుస్తోంది.

‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి. పవిత్ర సంగమం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సింధూ స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ఈ రోజున కృష్ణానది సముద్రంలో కలిసేచోట హంసలదీవిలో సింధూ స్నానాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీంతో హంసలదీవిలోని సాగర తీరమంతా భక్తజనసంద్రంగా మారుతుంది. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల‌ కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు.