కోవిడ్ కేసుల్లో ట్రయల్ కోసం 5 రూపాయల క్యాప్స్యూల్ !

కరోనా (కోవిడ్) కేసుల్లో రోగుల చికిత్స కోసం వాడే అవకాశం ఉందేమో పరిశీలించాలంటూ..నిపుణులు సూచిస్తున్న మందుల్లో మరొకటి కూడా వఛ్చి చేరింది. అదే... 'ఇండోమెథాసిన్' అనే మందు ! కేవలం 5 రూపాయలు ఖరీదు చేసే ఈ మందును..

కోవిడ్ కేసుల్లో ట్రయల్ కోసం 5 రూపాయల క్యాప్స్యూల్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 1:38 PM

కరోనా (కోవిడ్) కేసుల్లో రోగుల చికిత్స కోసం వాడే అవకాశం ఉందేమో పరిశీలించాలంటూ..నిపుణులు సూచిస్తున్న మందుల్లో మరొకటి కూడా వఛ్చి చేరింది. అదే… ‘ఇండోమెథాసిన్’ అనే మందు ! కేవలం 5 రూపాయలు ఖరీదు చేసే ఈ మందును సాధారణంగా ఎరిత్రైటిస్ (కీళ్లజబ్బుల) చికిత్సలో వాడుతారట.  ఈ క్యాప్స్యూల్ ని కరోనా రోగుల చికిత్సలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయేమో చూడాలంటూ చెన్నైకి చెందిన డాక్టర్ ఒకరు చెప్పడంతో.. దీని క్లినికల్ ట్రయల్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నడుం బిగించింది. పైగా ఈ మందును ‘సైటోకిన్ స్టామ్’ అనే రుగ్మత నివారణకోసం కూడా వాడుతారని చెన్నై డాక్టర్ రాజన్ రవీంద్రన్ అంటున్నారు. ఈ సైటోకిన్ స్టామ్’.. కరోనా రోగుల రోగనిరోధక శక్తిని హరిస్తుందని, అందువల్ల  ‘టొసిలిజుమాబ్’ అనే మెడిసిన్ ని, ఇండోమెథాసిన్  కూడా వాడిన పక్షంలో మంచి ఫలితాలు ఉండవచ్చునంటూ ఆయన అమెరికా, బ్రిటన్ దేశాల్లోని తన సహచర డాక్టర్లకు కూడా లేఖలు రాశారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ అయిన ఈయన.. 1989 లోనే తొలిసారిగా ఈ కాంబినేషన్ మందులను వాడారట. కరోనా పేషంట్స్ చికిత్సలో వీటిని వాడే విషయమై గత ఏప్రిల్ 29 న ఆయన ఐసీఎంఆర్ కు కూడా లేఖ రాశారు.

ఆయన చేసిన ప్రతిపాదనను తాము థెరాపెటిక్ టాస్క్ ఫోర్స్ కి పంపినట్టు బ్రిటన్ హెల్త్ కమిషన్  తెలిపింది. ఆ కమిషన్ పంపిన సమాచారాన్ని ఐసీఎంఆర్ పరిశీలిస్తోంది. తమకు ఈ విధమైన 185 ప్రతిపాదనలు అందినట్టు ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. కాగా డాక్టర్ రాజన్ రవీంద్రన్ సూచించిన మందును తాము సుమారు 60 మంది కరోనా రోగులకు వాడామని, ఇది వారిపై మంచి ప్రభావాన్ని చూపిందని యుఎస్ డాక్టర్లు తెలిపారట. ఇది హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ కన్నా మంచిదే అని వారు అభిప్రాయపడినట్టు సమాచారం !