బ్రేకింగ్ : ఏపీ రాజ్యసభలో వైసీపీ విజయం

| Edited By: Pardhasaradhi Peri

Jun 19, 2020 | 7:25 PM

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో నలుగరు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ విజయాన్ని దక్కించుకున్నారు.

బ్రేకింగ్ : ఏపీ రాజ్యసభలో వైసీపీ విజయం
Follow us on

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో నలుగరు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ విజయాన్ని దక్కించుకున్నారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌ (జూన్19) శుక్రవారం జరిగింది.

రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు పోటీ జరగగా.. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసీపీ నుంచి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి, వ్యాపారవెత్త పరిమళ్‌ నత్వానీ పోటీ చేశారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలోకి దిగారు. పోలింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభయింది. సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగింది.

చివరి నిమిషంలో…

చివరి నిమిషంలో టీడీపీ చెందిన ముగ్గరు ఎమ్మెల్యేలు ఆలస్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.