AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీ మాజీ ఆరోగ్య మంత్రి కరోనాతో మృతి

కరోనా వైరస్ కరాళనృతానికి దేశం విలవిలలాడుతోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా కొవిడ్ బారినపడుతున్నారు. కరోనాను జయించి కొందరు ఇళ్లకు చేరుకుంటుంటే, మరికొందరు రాకాసి కాటు బలవుతున్నారు. తాజా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఘూరా రామ్ ప్రాణాలు కోల్పోయారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

యూపీ మాజీ ఆరోగ్య మంత్రి కరోనాతో మృతి
Balaraju Goud
|

Updated on: Jul 16, 2020 | 5:33 PM

Share

కరోనా వైరస్ కరాళనృతానికి దేశం విలవిలలాడుతోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా కొవిడ్ బారినపడుతున్నారు. కరోనాను జయించి కొందరు ఇళ్లకు చేరుకుంటుంటే, మరికొందరు రాకాసి కాటు బలవుతున్నారు. తాజా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఘూరా రామ్ ప్రాణాలు కోల్పోయారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత మంగళవారం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో రామ్‌ను ఆస్పత్రిలో చేర్చినట్టు ఆయన కుమారుడు సంతోష్ కుమార్ వెల్లడించారు. దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నిన్న వెలువడిన వైద్య పరీక్షల్లో తన తండ్రికి కొవిడ్-19 సోకినట్టు తేలిందనీ.. సాయంత్రానికల్లా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని సంతోష్ తెలిపారు.

బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఘూరా రామ్.. 1993, 2002, 2007 ఎన్నికల్లో రాస్రా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాయావతి ప్రభుత్వంలో రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఆయన… ఆ పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్టీలో సీనియర్ నేత కొవిడ్ తో మృతి చెందడంపట్ల ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Follow Us
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్