అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రాప్తాడులోని సనప గ్రామంలో టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. మరోవైపు ఆత్మకూరు మండలం సిద్ధరామాపురంలో ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈవీఎంలు మొరాయించడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆందోళన నెలికొంది.