టమోటాల లారీలో పేలుడు పదార్థాల స్మగ్లింగ్.. తమిళనాడు పోలీసులకు చిక్కిన వైనం.. కేరళకు తరలుతున్న ఎక్స్‌ప్లోజివ్స్

|

Nov 15, 2020 | 5:14 PM

పైకి చూస్తే టమోటా లోడు.. లోన చూస్తే పేలుడు పదార్థాలు.. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు షాక్ తగిలేలా చేస్తున్న అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. తనిఖీ చేస్తామంటే టమోటా లోడును ఏం తనిఖీ చేస్తారు సార్? అంటూ...

టమోటాల లారీలో పేలుడు పదార్థాల స్మగ్లింగ్.. తమిళనాడు పోలీసులకు చిక్కిన వైనం.. కేరళకు తరలుతున్న ఎక్స్‌ప్లోజివ్స్
Follow us on

Explosives found in tomato lorry: పైకి చూస్తే టమోటా లోడు.. లోన చూస్తే పేలుడు పదార్థాలు.. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు షాక్ తగిలేలా చేస్తున్న అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. తనిఖీ చేస్తామంటే టమోటా లోడును ఏం తనిఖీ చేస్తారు సార్ అంటూ నిలదీసిన సిబ్బంది ఆ తర్వాత లోపల పేలుడు పదార్థాలు కనిపించడంతో ఖంగు తిన్నారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు నుంచి కేరళ వెళుతోంది ఓ లారీ. లారీ నిండా టమోటాలు నింపిన ప్లాస్టిక్ బుట్టలున్నాయి. తమిళనాడులోని సేలం నుంచి కేరళలోని అలూవాకు ఈ టమోటాలు తరలి వెళుతున్నాయి. సహజంగానే రాష్ట్ర సరిహద్దులో లారీలను తనిఖీలు చేస్తుంటారు పోలీసులు. ఇందులో భాగంగానే తమిళనాడు పోలీసులు ఈ టమోటా లోడుతో వెళుతున్న లారీని ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు.

టమోటాలున్న లారీని తనిఖీ చేయడమెందుకని మొరాయించే ప్రయత్నం చేశారు లారీ సిబ్బంది. దాంతో పోలీసులకు మరింత అనుమానమొచ్చింది. పైపైన కాకుండా లోతుగా తనిఖీలు నిర్వహించాలని తలపెట్టారు. లారీ లోపలి కంతా వెళ్ళి.. ప్రతి బుట్టను తనిఖీ చేయడం మొదలు పెట్టారు. దాంతో లారీ సిబ్బంది పోలీసులను మచ్చిక చేసుకునేందుకు ఆశలు చూపడం మొదలు పెట్టారు. మరింత అనుమానానికి లోనైన పోలీసులు లోతుగా తనిఖీ చేయడం ప్రారంభించారు.

తీరా చూస్తే టమోటాలున్న బుట్టల కింద పేలుడు పదార్థాలు కనిపించాయి. టమోటాల లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 7000 గిలెటిన్ స్టిక్స్, 7500 డిటోనేటర్లను పోలీసులు కనుగొన్నారు. గిలెటిన్ స్టిక్స్‌ని, డిటోనేటర్లను 35 బుట్టల్లో దాచారు లారీ సిబ్బంది. పేలుడు పదార్థాలను సీజ్ చేసిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ పేలుడు పదార్థాలు ఎవరి దగ్గరి నుంచి ఎవరికి చేరవేస్తున్నారనే విషయంపై ఆరా తీయడం మొదలు పెట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ALSO READ: కెనడాలో తెలుగు యువకుని ఆత్మహత్య

ALSO READ: ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్

ALSO READ: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ముహూర్తం ఖరారు

ALSO READ: వైసీపీలో వర్గపోరు.. టెంపుల్ కోసం తన్నులాట

ALSO READ: ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి

ALSO READ: పెద్దపులి భయంతో జంతు బలి బంద్..

ALSO READ: కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు