
నవజీవన్ సూపర్‍ఫాస్ట్ ట్రైన్‍లో దోపిడీ జరిగింది. ట్రైన్ గుంటూరు పెద్దవడ్లమూడి దగ్గరకు చేరుకున్న సమయంలో దుండగుడు కత్తి చూపించి బోగీల్లోని మహిళలపై దాడి చేశారు. మహిళల మెడల్లోని ఆభరణాలు గుంజుకొని వారిని తీవ్రంగా గాయపరిచారు.
ట్రైన్‍లో ఆగంతకుడి దాడితో భయాందోళనకు గురైన మహిళ ఖమ్మంకు చెందిన సుజాత…రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు విజయవాడ రైల్వే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.