ఏపీలో ఎవరికి పట్టం ? సర్వే ఏం చెబుతోంది ?

|

May 19, 2019 | 8:53 PM

ఏపీలో తాజాగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎలైట్ సంస్థ నిర్వహించిన ప్రీ-పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేల్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత సర్వే ప్రకారం.. 106 అసెంబ్లీ స్థానాల్లో (44.6 శాతం) టీడీపీ ముందంజ లో ఉండగా.., 68 సీట్లలో  (41.3 శాతం) వైసీపీ రెండో స్థానంలో  ఉంది.. ఒక అసెంబ్లీ స్థానంతో జనసేన కూటమి(12.8శాతం) మూడో స్థానంలో నిలిచింది. గ్రామీణ, పట్టణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి, రిజర్వ్ చేసిన స్థానాల్లో […]

ఏపీలో ఎవరికి పట్టం ? సర్వే ఏం చెబుతోంది ?
Follow us on

ఏపీలో తాజాగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎలైట్ సంస్థ నిర్వహించిన ప్రీ-పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేల్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత సర్వే ప్రకారం.. 106 అసెంబ్లీ స్థానాల్లో (44.6 శాతం) టీడీపీ ముందంజ లో ఉండగా.., 68 సీట్లలో  (41.3 శాతం) వైసీపీ రెండో స్థానంలో  ఉంది.. ఒక అసెంబ్లీ స్థానంతో జనసేన కూటమి(12.8శాతం) మూడో స్థానంలో నిలిచింది. గ్రామీణ, పట్టణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి, రిజర్వ్ చేసిన స్థానాల్లో వైసీపీకి ప్రజలు మద్దతు పలికారు. ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై 38.65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా,,35.4 శాతం మంది అసంతృప్తి ప్రకటించారు. భవిష్యత్తులో ఏ పార్టీ అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు టీడీపీకి అనుకూలంగా 43.8 శాతం మంది, వైసీపీకి అనుకూలంగా 40.3 శాతం మంది మాట్లాడారు. జనసేన పట్ల 12.6 శాతం మంది మొగ్గు చూపారు. ఇతర పార్టీలు అయితే బెటర్ అని 3.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.  టీడీపీ ప్రభుత్వ పాలన బాగుందని 36.5 శాతం, బాగా లేదని 34.8 శాతం, ఫరవాలేదని 20.6 శాతం పేర్కొన్నారు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది చంద్రబాబేనని 45.8 శాతం, జగన్ అని 40.6 శాతం, పవన్ కళ్యాణ్ అని 9.7 శాతం తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇక జిల్లాలు, పార్టీల వారీగా సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.