పూరీ జగన్నాథ్, రామ్ ఫస్ట్‌టైమ్ చేతులు కలిపి తీసిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. మహేశ్‌బాబును పోకిరిగా, బన్నీని దేశముదురుగా, ప్రభాస్‌ని ఏక్‌నిరంజన్‌గా మార్చేసిన పూరీ తాజాగా రామ్‌ని ఇస్మార్ట్‌గా తయారుచేసేశాడు. రామ్ తన తొలి చిత్రం దేవదాసు నుంచి మొన్నటి హలో గురు ప్రేమ కోసం వరకు ఆంధ్రా హీరోగానే నటించాడు. మొట్టమొదటిసారిగ పక్కా తెలంగాణ పోరగాడి లెక్క పూరీ తీర్చిదిద్దాడు. ఇస్మార్ట్ శంకర్‌గా ఫస్ట్‌టైమ్ కంప్లీట్ హైదరాబాదీ యాసలో డైలాగ్స్ చెప్పాడు హీరో రామ్.
ఈ చిత్రం కథాపరంగా చూస్తే హైదరాబాదీ అయిన శంకర్ అనే కుర్రాడు జులాయిగా తిరుగుతుంటాడు. ఎక్కువగా బ్యాడ్‌బాయ్‌గా కనిపిస్తుంటాడు. అలాంటి అబ్బాయి మెదడులో పోలీస్ చిప్ పెడతారు. ఆ తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా చేంజ్ అయిపోతుంది. అప్పటినుంచి డబుల దిమాకీ హైదరాబాదీగా మారిపోతాడు.
డైరెక్టర్ పూరీ చాల కాలం తర్వాత ఎంతో ఇష్టంగా ఈ సినిమా కథను రాసుకున్నాడట. వరుసగా ప్లాప్స్ చూసిన పూరీ ఈ చిత్రంపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. మణిశర్మ అందించిన సంగీతం అదరహో అనిపిస్తోంది. ఈ చిత్రంలో కథానాయికలుగా నభా నటేశ్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. నభా తెలంగాణ అమ్మాయిగా, నిధి సైంటిస్ట్ పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని పూరీ నిర్మించి డైరెక్షన్ చేస్తుండగా చార్మీ కో- ప్రొడ్యూసర్. రామ్ -పూరీల ఫస్ట్ కాంబినేషన్ ఈ చిత్రం మరి ఈ వీకెండ్ బాక్సాఫీస్‌కి ఊపు తెస్తుందా లేదో చూడాలి.