5

ఢిల్లీలో కరోనా విలయం.. ఒక్క రోజులో 428 కేసుల నమోదు

దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తరువాత ఢిల్లీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 428 కేసులు నమోదు కాగా.. మొత్తం వీటి సంఖ్య 5,500 కి పెరిగింది..

ఢిల్లీలో కరోనా విలయం.. ఒక్క రోజులో 428 కేసుల నమోదు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 07, 2020 | 1:19 PM

దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తరువాత ఢిల్లీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 428 కేసులు నమోదు కాగా.. మొత్తం వీటి సంఖ్య 5,500 కి పెరిగింది. (బుధవారం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50 వేలకు పైగా నమోదయ్యాయి). ఢిల్లీ నగరంలో మృతుల సంఖ్య 65 కి చేరింది. 24 గంటల్లో 74 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు ఇలా కోలుకున్నవారి సంఖ్య 1542 కి పెరిగింది. తాజా మృతుల్లో 31 ఏళ్ళ కానిస్టేబుల్ కూడా ఉన్నాడని, సోమవారం వరకు కూడా అతనిలో ఎలాంటి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడలేదని తెలిసింది. ఢిల్లీ పోలీసు శాఖలో ఇది తొలి మరణం.

అటు మహారాష్ట్రలో 15,525 కేసులు నమోదు కాగా.. 617  మంది రోగులు మృతి చెందారు. గుజరాత్ లో 6,245 కేసులు నమోదు కాగా.. 368 మంది మృత్యుబాట పట్టారు.