తృణమూల్ ఎంపీ మొత్రాయ్‌పై పరువునష్టం కేసు

| Edited By:

Jul 20, 2019 | 12:29 AM

తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ మహువా మొయ్‌త్రాపై పరువునష్టం దావా కేసు దాఖలైంది. లోక్‌సభలో తొలి ప్రసంగంతోనే దేశం దృష్టి ఆకర్షించిన మహువా.. ప్రధాని మోదీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేసి పాపులారిటీ సంపాదించారు. అయితే జూన్ 25న లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంలో జీ న్యూస్ ఛానెల్‌‌పై విరుచుకుపడ్డారని లేనిపోని ఆరోపణలు చేసారంటూ ఆ ఛానెల్ చీఫ్ సుధీర్ చౌదరి ఆమెపై కోర్టుకెక్కారు. తన ప్రసంగంలో తమ సంస్ధ యజమానిని చోర్ అని సంబోధించారని, తమ ఛానెల్‌ను […]

తృణమూల్ ఎంపీ మొత్రాయ్‌పై పరువునష్టం కేసు
Follow us on

తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ మహువా మొయ్‌త్రాపై పరువునష్టం దావా కేసు దాఖలైంది. లోక్‌సభలో తొలి ప్రసంగంతోనే దేశం దృష్టి ఆకర్షించిన మహువా.. ప్రధాని మోదీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేసి పాపులారిటీ సంపాదించారు. అయితే జూన్ 25న లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంలో జీ న్యూస్ ఛానెల్‌‌పై విరుచుకుపడ్డారని లేనిపోని ఆరోపణలు చేసారంటూ ఆ ఛానెల్ చీఫ్ సుధీర్ చౌదరి ఆమెపై కోర్టుకెక్కారు. తన ప్రసంగంలో తమ సంస్ధ యజమానిని చోర్ అని సంబోధించారని, తమ ఛానెల్‌ను అమ్ముడుపోయిన వార్తా సంస్ధగా ప్రస్తావించారని జీ న్యూస్ యాజమాన్యం ఆరోపించింది.

మహువా మొత్రాయ్ వ్యాఖ్యాలను సీరియస్‌గా తీసుకున్న జీ న్యూస్ యాజమాన్యం ఆమెపై న్యాయపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఈమేరకు ఆమెపై పటియాలా హౌస్ కోర్టులో పరువునష్టం కేసు దాఖలుచేశారు. జీ న్యూస్ యాజమాన్యంపై తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో పాటు తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించడంపై ఆమెపై పరువునష్టం కేసు ఫైల్ చేసినట్టుగా సంస్ధ న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. బెంగాల్‌లోని కృష్ణానగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా మొయ్‌త్రా గెలుపొందారు.