ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన సంగతి తెలిసిందే. చైనా పుట్టినిల్లు అయిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11,774,897 కరోనా కేసులు నమోదు కాగా, 541,622 మంది వైరస్ కారణంగా మరణించారు. అటు 6,767,482 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా పెరు టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ వైరస్ మనకు సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని అవి మర్చిపోకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి మన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.