కరోనా నిర్ధారణ పరీక్షకు ఎంత ఖర్చవుతుందో తెల్సా..?

|

Mar 20, 2020 | 4:20 PM

ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ప్రజల ప్రాణాలను హరిస్తూ..రోజురోజుకు తన పరిధిని విస్తరిస్తోంది. ఇండియాలో కూడా కరోనా భారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. దేశంలో లక్షణాలు కనిపించిన లక్షలమందికి ప్రభుత్వాలు ఉచితంగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే రూ. 4500 నుంచి రూ. 5000 ఖర్చు చేస్తున్నట్టు […]

కరోనా నిర్ధారణ పరీక్షకు ఎంత ఖర్చవుతుందో తెల్సా..?
Follow us on

ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ప్రజల ప్రాణాలను హరిస్తూ..రోజురోజుకు తన పరిధిని విస్తరిస్తోంది. ఇండియాలో కూడా కరోనా భారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. దేశంలో లక్షణాలు కనిపించిన లక్షలమందికి ప్రభుత్వాలు ఉచితంగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే రూ. 4500 నుంచి రూ. 5000 ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐసిఎమ్‌ఆర్(భారత వైద్య పరిశోధన మండలి) లెక్కల ప్రకారం..కరోనా వైరస్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షకు రూ. 1500…తుది నిర్ధారణ పరీక్షకు రూ. 3500 ఖర్చు అవుతుంది.

కరోనా నిర్ధారణ పరీక్షల కోసం మన దేశం.. లెటెస్ట్ టెక్నాలజీని జర్మనీ, అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని…ప్రముఖ ల్యాబ్ నెట్‌వర్క్ సంస్థ ‘ట్రివిట్రాన్‌ న్యూబర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌’ చైర్మన్‌ జీఎస్‌కే వేలు తెలిపారు. అందుకే భారీ స్థాయిలో ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని మన దేశంలోనే డెవలప్ చేసుకుంటే పరీక్ష ఖర్చు రూ. 500లోపే ఉంటుందని చెప్పుకొచ్చారు.