కేంద్రానికి షాక్ ? 370 అధికరణం రద్దుపై ఇక ‘ సుప్రీం ‘ విచారణ !

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో.. వీటిపై విచారణకు కోర్టు అయిదుగురు జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎన్.వి. రమణ ఆధ్వర్యాన ఏర్పాటైన ఈ బెంచ్ వచ్ఛే నెల 1 నుంచి వీటిపై విచారణ ప్రారంభిస్తుంది. ఈ అధికరణం రద్దు లోని రాజ్యాంగ బధ్ధ చెల్లుబాటును, దానిపై ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ను ఈ ధర్మాసనం పరిశీలిస్తుందని అధికారవర్గాలు […]

కేంద్రానికి షాక్ ? 370 అధికరణం రద్దుపై ఇక ' సుప్రీం ' విచారణ !
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 28, 2019 | 4:52 PM

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో.. వీటిపై విచారణకు కోర్టు అయిదుగురు జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎన్.వి. రమణ ఆధ్వర్యాన ఏర్పాటైన ఈ బెంచ్ వచ్ఛే నెల 1 నుంచి వీటిపై విచారణ ప్రారంభిస్తుంది. ఈ అధికరణం రద్దు లోని రాజ్యాంగ బధ్ధ చెల్లుబాటును, దానిపై ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ను ఈ ధర్మాసనం పరిశీలిస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కూడా కేంద్రం విభజించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విస్తృత ధర్మాసనం అక్టోబరు మొదటివారంలో విచారణ జరుపుతుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఆగస్టులోనే ప్రకటించింది. మొట్ట మొదట ఎం.ఎల్.శర్మ అనే లాయర్ కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేశారు. అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలతో బాటు అనేమంది తమ పిటిషన్లు వేశారు. జమ్మూ కాశ్మీలో అమలవుతున్న ఆంక్షలను రద్దు చేయాలని కూడా వీరు తమ పిటిషన్లలో కోరారు. ఈ ఆంక్షల కారణంగా ప్రజలు స్వేఛ్చగా తిరగలేకపోతున్నారని వీరు పేర్కొన్నారు. ఇంకా ఇప్పటికీ ఈ రాష్ట్రంలో పలు షాపులు, స్కూళ్ళు మూతబడే ఉన్నాయి. కాగా-జమ్మూ-కాశ్మీర్ అక్టోబరు 31 నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలు కానున్నాయి.

పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో