కల్నల్‌ సంతోష్ కుటుంబానికి రూ.5 కోట్ల సహాయం.. భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం..

| Edited By:

Jun 19, 2020 | 8:01 PM

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్ధిక సహాయంతో పాటు.. ఆయన భార్యకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

కల్నల్‌ సంతోష్ కుటుంబానికి రూ.5 కోట్ల సహాయం.. భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం..
Follow us on

సోమవారం రాత్రి లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసింది. వీరిలో మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. ఇనుప చువ్వలు ఉన్న రాడ్లతో కల్నల్ సంతోష్‌పై చైనా సైనికులు విచక్షనా రహితంగా దాడికి పాల్పడ్డారు. అతడి తలకు బలమైన గాయాలవ్వడంతో ఆయన అక్కడే వీరమరణం పొందారు. ఈ క్రమంలో గురువారం నాడు సూర్యపేట్‌లో ఆయన అంత్యక్రియలు సైనిక లాంచనాలతో పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలతో పాటు.. పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఇక మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. ఆయన భౌతికకాయం రాష్ట్రానికి చేరుకున్పప్పటి నుంచి మొదలు.. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కల్నల్ సంతోష్ బాబు కుంటుంబతోనే ఉన్నారు.

ఈ క్రమంలో కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్ధిక సహాయంతో పాటు.. ఆయన భార్యకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. గాల్వన్ ఘటనలో వీరమరణం పొందిన మిగతా 19 మంది జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చోప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.