తిరుమలేశుని పింక్ డైమండ్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ విపక్ష నాయకుడు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అతిదారుణంగా అణిచివేసే ధోరణి అవలంభిస్తోందని, ఎంత అణగదొక్కితే ప్రజలు, టిడిపి వర్గాలు అంత రెచ్చిపోతారని గ్రహించాలని చంద్రబాబు అన్నారు. పోలీసుల్ని అడ్డంపెట్టుకుని సోషల్ మీడియా పై దారుణంగా వ్యవహరిస్తున్నారని, వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సామాజిక మీడియా లో వచ్చే వాటిపై చట్టం అందరికీ ఒకేలా ఉందా లేదా ఏపీ పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా […]
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ విపక్ష నాయకుడు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అతిదారుణంగా అణిచివేసే ధోరణి అవలంభిస్తోందని, ఎంత అణగదొక్కితే ప్రజలు, టిడిపి వర్గాలు అంత రెచ్చిపోతారని గ్రహించాలని చంద్రబాబు అన్నారు. పోలీసుల్ని అడ్డంపెట్టుకుని సోషల్ మీడియా పై దారుణంగా వ్యవహరిస్తున్నారని, వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సామాజిక మీడియా లో వచ్చే వాటిపై చట్టం అందరికీ ఒకేలా ఉందా లేదా ఏపీ పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా కాదని చట్ట వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, సామాజిక మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు చంద్రబాబు. రెవెన్యూ లోటు, సన్నబియ్యం, ఇసుక కొరత మీద ప్రశ్నించినా కూడా పోలీసులు కేసులు పెడతారా అని నిలదీశారు.
తిరుమల శ్రీవేంకటేశ్వ స్వామివారి పింక్ డైమండ్ తన ఇంట్లో ఉందని గతంలో చెప్పిన జెఈఓ ధర్మారెడ్డి ఇప్పుడు అసలు పింక్ డైమండ్ అనేదే లేదంటున్నారని, ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.