లదాక్‌పై మోడీ స్పెషల్ ఫోకస్
లదాక్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 2020-21 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి...

Central Government Focused on Ladakh : లదాక్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 2020-21 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రూ.5,958 కోట్లు కేటాయించినట్టు బీజీపీ లఢఖ్ యూనిట్ చీఫ్, ఎంపీ జమ్యాంగ్ టిసెరింగ్ నంగ్యాల్ తెలిపారు. లేహ్-పాడుమ్-డార్చా రహదారిని అనుసంధానించడం ద్వారా జియోగ్రాఫికల్ లాక్‌డౌన్ నుంచి జాన్స్‌కర్ తెరుచుకుంటుందని ఎంపీ ట్వీట్ చేశారు.
440 కిలోమీటర్ల పాత లేహ్-కార్గిల్-పాడుమ్ రోడ్డును సరికొత్త లేహ్-సింగేలా-పాడుమ్ రోడ్డుతో అనుసంధానించి దూరాన్ని160 కిలోమీటర్లకు తగ్గిస్తామన్నారు. రెండేళ్ల పనిని రెండు నెలల్లో పూర్తిచేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల కనెక్టివిటీ ఆధునిక నాగరికత ప్రధాన అశమని చెప్పుకొచ్చారు. లెహ్-పాడమ్ రోడ్డు రికార్డు వ్యవధిలో కనెక్ట్ అయిందని నాంగ్యాల్ పేర్కొన్నారు.