కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారు-చంద్రబాబు

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని వీడే వారి గురించి పెద్దగా పట్టించుకోకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఇవాళ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తదితర నేతలు పార్టీ వీడుతున్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కొందరు పోతే పార్టీకి నష్టాల కన్నా లాభాలే మిన్న అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని తేల్చిచెప్పారు. కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అవంతి శ్రీనివాస్‌ విషయానికి […]

కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారు-చంద్రబాబు

Edited By:

Updated on: Oct 18, 2020 | 11:05 PM

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని వీడే వారి గురించి పెద్దగా పట్టించుకోకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఇవాళ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తదితర నేతలు పార్టీ వీడుతున్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కొందరు పోతే పార్టీకి నష్టాల కన్నా లాభాలే మిన్న అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని తేల్చిచెప్పారు. కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

అవంతి శ్రీనివాస్‌ విషయానికి కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదనే అభిప్రాయానికి తెదేపా అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల్లో పార్టీ బలంగా ఉందని, సార్వత్రిక ఎన్నికల్లో ఇవే తమను తిరిగి మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయనే పార్టీ వర్గాలు ధీమాగా ఉండాలని చంద్రబాబు పిలుపునిస.