
పెద్దపల్లి జిల్లాలో చేతబడి పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు స్థానికుల్ని భయపెడుతున్నారు. సుల్తానాబాద్‍లోని శాస్త్రీనగర్‍కు చె౦దిన రాజమల్లు అనే వ్యక్తి ఇంట్లో పరుపుపైన మనిషి ఆకారం బొమ్మగీసి కోడొగుడ్లు, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేయడం కలకలం రేపింది.
రాజమల్లు ఇంట్లో జరిగిన క్షుద్రపూజలతో స్థానికులు వణికిపోతున్నారు. మంత్రించిన గుడ్లు, నిమ్మకాయలు, తాయత్తులు రోడ్లపై వేస్తుండడంతో వాటిని చూసి హడలిపోతున్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించాలని జన విజ్ఞానవేదిక సభ్యుల్ని కోరారు పోలీసులు.