AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆశ్చర్యపరిచే అంశాలతో బోస్టన్ నివేదిక

అందరూ ఎదురు చూసిన బోస్టన్ గ్రూపు నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరిపోయింది. నివేదికాంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యపోయే అంశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై ఓ వైపు ఉద్యమం రగులుకుంటూనే వున్న తరుణంలో రాజధాని అంశంపై అధ్యయనానికి ఏర్పాటైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక అంద జేసింది. బీసీజీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను బీసీజీ తమ నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించినట్లు […]

ఆశ్చర్యపరిచే అంశాలతో బోస్టన్ నివేదిక
Rajesh Sharma
|

Updated on: Jan 03, 2020 | 6:13 PM

Share

అందరూ ఎదురు చూసిన బోస్టన్ గ్రూపు నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరిపోయింది. నివేదికాంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యపోయే అంశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై ఓ వైపు ఉద్యమం రగులుకుంటూనే వున్న తరుణంలో రాజధాని అంశంపై అధ్యయనానికి ఏర్పాటైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక అంద జేసింది. బీసీజీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి నివేదిక అందజేశారు.

రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను బీసీజీ తమ నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం అందుతోంది. అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితులను వివరించిన బీసీజీ.. ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలను వివరించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, టూరిజం, మత్స్య రంగాల్లో ప్రణాళికలను బోస్టన్ నివేదికలో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు, వాటి ఆర్థిక పనితీరును నివేదికలో ప్రస్తావించిన బీసీజీ.. అవన్నీ అనుకున్న లక్ష్యాలను సాధించాయా? లేదా? అన్నదానిపై గణాంకాలతో తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోని వివిధ దేశాల బహుళ రాజధానులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బహుళ రాజధానులు, బహుళ రాజధాని కార్యకలాపాల కేంద్రాలపై నివేదికలో ప్రస్తావించారు బోస్టన్ ప్రతినిధులు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ అంశాన్ని తన నివేదికలో ప్రస్తావించిన బీసీజీ.. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలను స్పష్టంగా తెలియచేసిందని చెబుతున్నారు. రాష్ట్రం సత్వరంగా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. అదే సమయంలో సత్వర ఫలితాల సాధనకు ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని బీసీజీ నివేదికలో కూలంకషంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

బోస్టన్ నివేదికపై జనవరి ఆరో తేదీన రాష్ట్ర హైపవర్ కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు, మూడు విడతలుగా బోస్టన్, జీఎన్ రావు నివేదికలపై హైపవర్ కమిటీ భేటీ అవుతుందని, ఈనెల మూడో వారంలో హైపవర్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తుందని చెబుతున్నారు. ఈలోగా జనవరి 8వ తేదీన జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలోను బోస్టన్ గ్రూపు ఇచ్చిన నివేదికను ఎజెండాగా చేరుస్తారని, గత కేబినెట్‌లో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించిన విధంగానే జనవరి 8న జరిగే కేబినెట్ భేటీలోను బోస్టన్ గ్రూపు నివేదికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.