ఏపీ అసెంబ్లీలో ఆరు కీలక బిల్లులు.. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు

| Edited By: Srinu

Jul 23, 2019 | 2:31 PM

వైసీపీ మ్యానిపెస్టోలోని నవరత్నాల అమల్లో భాగంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ మేరకు ఏపీ శాసనసభలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆరు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. ఇకపై వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో శాశ్వతంగా బీసీ కమిషన్ ఏర్పాటు, పరిశ్రమల్లో స్ధానికులకు 75 శాతం కోటా కల్పన, మహిళలకు 50 శాతం నామినేటెడ్ పదవులు,50 శాతం ప్రభుత్వ నామినేషన్ పనుల కేటాయింపు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు ఈ […]

ఏపీ అసెంబ్లీలో ఆరు కీలక బిల్లులు.. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు
Follow us on

వైసీపీ మ్యానిపెస్టోలోని నవరత్నాల అమల్లో భాగంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ మేరకు ఏపీ శాసనసభలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆరు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. ఇకపై వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో శాశ్వతంగా బీసీ కమిషన్ ఏర్పాటు, పరిశ్రమల్లో స్ధానికులకు 75 శాతం కోటా కల్పన, మహిళలకు 50 శాతం నామినేటెడ్ పదవులు,50 శాతం ప్రభుత్వ నామినేషన్ పనుల కేటాయింపు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు ఈ బిల్లులో ఉన్నాయి. పాలనలోనూ చారిత్రక విధానాలతో మార్పులకు శ్రీకారం చుడుతూ ముందుకు వెళ్తోంది జగన్ సర్కార్. సోమవారం ప్రవేశపెట్టిన బిల్లుల్లో ప్రమఖమైంది శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు. దీని ద్వారా బీసీ కులాల నిరంతర అధ్యయనం, రిజర్వేషన్ల కల్పన వంటివాటిపై కమిషన్ చర్చించే అవకాశం కలిగింది.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు సైతం నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కోటా కల్పిస్తూ మరో బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక బిల్లు, మహిళలకు మరో బిల్లును వేరువేరుగా ప్రవేశపెట్టారు. అదే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అలాగే మహిళలకూ ప్రభుత్వ నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం వాటా ఇచ్చేలా మరో రెండు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి చట్టరూపం కల్పించింది. ఈ నిర్ణయాలు కుల రాజకీయాలు అధికంగా ఉండే ఏపీ వంటి రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక మార్పుకు కారణమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తానికి ఏపీలో జగన్ సర్కార్ అనుకున్న లక్ష్యాలను అతి కొద్ది సమయంలోనే పూర్తిచేసే దిశగా ముందుకు వెళుతోంది.